‘శాతకర్ణి’లో బాలయ్య రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Balayya-Remuneration

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’’. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో బాలయ్య రికార్డులకు అమ్మ మొగుడు కావడం ఖాయం అంటున్నారు టాలీవుడ్ ఎక్స్‌పర్ట్స్. అయితే ఇంతటి భారీ బడ్జెట్ చిత్రం.. చారిత్రాత్మక కాన్సెప్ట్‌.. భారీ కాస్టింగ్.. ఉన్న సినిమాలో సాధారణంగా హీరోలు తమ రెమ్యునరేషన్ విషయంలోనూ ఏమాత్రం ఆలోచించకుండా వీలైనంత భారీ మొత్తం తీసుకునేందుకు రెడీ అవుతారు. కానీ తన దారి అలాంటిది కాదంటున్నాడు నందమూరి నటసింహం. మామూలుగా అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్.. తనకు ఉన్న డిమాండ్‌నుబట్టి చూస్తే బాలయ్య ఎంతలేదన్నా రూ. 10 – 15 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. కానీ బాలయ్య మాత్రం అలా చేయలేదు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా.. తన ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో ఈ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లో భారీ విజయం చేకూరేలా చేస్తున్నారు చిత్ర యూనిట్. వారితో పాటు బాలయ్య కూడా సినిమా కోసం తనవంతు కృషి మొత్తం చేస్తున్నారు. డూప్ లేకుండా మరి సీన్స్ చేయడం.. యాక్షన్ సీన్స్‌లోనూ రెచ్చిపోయి నటించేయడంతో సినిమా సూపర్ హిట్ పక్కా అంటున్నారు చిత్ర యూనిట్. అయితే ఇలాంటి సినిమాకు బాలయ్య కేవలం రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం అందరికీ షాకిచ్చింది. ఒక స్టార్ హీరో, ఇలాంటి పీరియాడికల్ సినిమాలో తీసుకునే రెమ్యునరేషన్ ఇంత తక్కువా.. అంటూ వారు ఖంగుతింటున్నారు. కానీ బాలయ్య మాత్రం నిర్మాతలకు వీలైనంత సహాయం చేయాలనే ఆలోచనతో తన రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట. ఏదేమైనా ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారిపోవడంతో మిగతా స్టార్స్‌ సైతం ‘జై బాలయ్య’ అంటున్నారు.

Leave a comment