బాలయ్య.. వినాయక్.. అదిరిపోయే టైటిల్..!

vv-vinayak-balayya-movie

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా తర్వాత వి.వి.వినాయక్ డైరక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. 2002లో చెన్నకేశవ రెడ్డి సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.కే 47 అని టైటిల్ పెడుతున్నారట. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఖైది నంబర్ 150తో మెగాస్టార్ కి మెమరబుల్ హిట్ ఇచ్చిన వినాయక్ తేజూతో తీసిన ఇంటిలిజెంట్ సినిమాతో ఫ్లాప్ ఫేజ్ చేశాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వినాయక్ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చెన్నకేశవ రెడ్డి లానే ఈ సినిమా కూడా ఫ్యాక్షన్ కథతో వస్తుందట. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఓ ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. అదిరిపోయే కాంబినేషన్ దానికి మించి అంచనాలను ఏర్పరచిన ఈ టైటిల్ పై కూడా భారీ క్రేజ్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment