Gossipsబొద్దు బ్యూటీని పట్టుకొస్తున్న బాలయ్య

బొద్దు బ్యూటీని పట్టుకొస్తున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయంగా కాస్త ఫ్రీగా మారడంతో తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి స్క్రిప్టు పనులు కూడా పూర్తి చేశాడు బాలయ్య. తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో పలు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక కన్ఫ్యూజన్‌‌లు క్రియేట్ చేస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో బొద్దు బ్యూటీ నమిత‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలయ్యతో ఈ బ్యూటీ సింహా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. బొద్దు అందాలను ఆరబోసిన ఈ బ్యూటీని మరోసారి రిపీట్ చేయాలని బాలయ్య చూస్తు్న్నాడట. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అటు నమిత తన సెకెండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ట్రై చేస్తోంది.

మరి బాలయ్య ఈ బొద్దు బ్యూటీకి సెకెండ్ ఇన్నింగ్స్‌ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాను సి.కళ్యాణ్ ప్రొడ్యూస్ చేయనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news