బాలయ్య ఆఫర్ ని మిస్ అయిన ఆ భామలు…

BalaKrishna

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అసలు హీరోయిన్స్ గా రెజినాను అనుకున్నారట కారణాలు తెలియదు కాని బాలకృష్ణతో రెజినా నటించేందుకు సుముఖత చూపించలేదట. ఇక రెజినా కాదన్నదని ప్రగ్యా జైశ్వాల్ ను అడిగారట కాని ఆమె కూడా ప్రస్తుతం డేట్స్ ఖాళీ లేవని చెప్పేసిందట.

బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తే వచ్చే ఆ మైలేజ్ వేరు. మరి అలాంటి అవకాశాన్ని రెజినా, ప్రగ్యా జైశ్వాల్ లాంటి వారు ఎందుకు కాదనుకున్నారో తెలియట్లేదు. ప్రస్తుతం రెజినా కెరియర్ కూడా అంత సక్సెస్ ఫుల్ గా లేదు. అయినా సరే బాలయ్యతో సినిమాకు నిరాకరించిదట. ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం రెజినా ఓ సూపర్ హిట్ సినిమా మిస్ చేసుకున్నట్టే.

 

Leave a comment