పెళ్ళైనా సరే ఆమే కావాలంటున్న బాలయ్య..!

balayya-shreya

నందమూరి బాలకృష్ణ హీరోగా మహానటుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ తెరరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. తేజ డైరక్షన్ లో మొదలైన ఆ సినిమా ప్రస్తుతం ఆయన బయటకు రావడంతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్.టి.ఆర్ వినాయక్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందన్న వార్త ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది.

సి.కళ్యాణ్ నిర్మాతగా వినాయక్ డైరక్షన్ లో బాలయ్య బాబు సినిమా ఉంటుందట. ఈ సినిమా గురించి జై సింహా ఈవెంట్ లోనే చెప్పగా జూలై నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఓకే చెప్పాడు అంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ వెనక్కి వెళ్లినట్టే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మళ్లీ శ్రీయా శరణ్ నే కావాలని అంటున్నాడట బాలకృష్ణ.

వినాయక్ డైరక్షన్ లోనే చెన్నకేశవ రెడ్డి సినిమాలో బాలకృష్ణ శ్రీయ జంటగా నటించారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ 100వ సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా బాగా ఆడటంతో పూరి డైరక్షన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమాలో కూడా శ్రీయ శరణ్ తో రొమాన్స్ చేశాడు బాలకృష్ణ. ఈమధ్యనే ఆమెకు పెళ్లి అయ్యింది. రష్యన్ కుర్రాడిని పెళ్లాడిన శ్రీయా పెళ్లి తర్వాత సినిమాలు చేస్తా అని అన్నది. ఇప్పుడు బాలకృష్ణ వినాయక్ సినిమాలో కూడా శ్రీయనే హీరోయిన్ గా ప్రిఫర్ చేశాడట.

పెళ్లైనా సరే శ్రీయనే ఎందుకు కావాలంటున్నాడు అంటే సీనియర్ హీరోలకు అదే రేంజ్ ఉన్న సీనియర్ భామలు దొరకడం లేదు అందుకే ఉన్న వారితో సర్ధుకోవాల్సిందే. కొత్తవారికి అవకాశం ఇద్దాం అంటే ఏజ్ డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. అందుకే అయితే శ్రీయ లేదంటే నయనతార అంటూ హీరోలు ఇబ్బంది పడుతున్నారు.

Leave a comment