‘రామారావు’ సెంటిమెంట్ వదలని బాలకృష్ణ !

Bala krishna next movie updates

వంద సినిమాలు చేసిన తర్వాత బాలకృష్ణ తన సినిమాల స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. సరికదా మరింత పెంచాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో వచ్చి… ప్రేక్షకులను అలరించాడు బాలయ్య బాబు. ఇక ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా తో త్వరలో రానున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా కన్ఫర్మ్ చేశాడు బాలకృష్ణ.

ఫిబ్రవరి నుండి ఆ సినిమా షూటింగ్ మొదలు కానుందట. ఈమధ్యనే వినయ విధేయత సినిమాతో బోయపాటి శ్రీను అపనిందలు మూటగట్టుకున్నాడు. మరి బాలయ్య సినిమాతో పోయిన ఇమేజ్ తిరిగి తెచ్చుకుంటాడా లేదా అనేది చూడాలి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే సింహ లెజెండ్ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య సినిమా ఉంటుందని తెలుస్తోంది. పటాస్ నుండి సంక్రాంతికి సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి వరుస హిట్లు కొడుతున్నారు. అసలైతే బాలకృష్ణ 100వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఉండాల్సింది. అయితే తన 100 వ సినిమా ప్రత్యేకంగా ఉండాలని బాలయ్య క్రిష్ తో కమిట్ అయ్యాడు. అప్పుడు బాలకృష్ణకు అనిల్ చెప్పిన రామారావు గారి కథ బాగా నచ్చిందట. దీంతో ఇప్పుడు ఆ కథతో బాలయ్య- అనిల్ సినిమా ఉంటుందని ఫిలిం నగర్ టాక్. ఈ పరిణామాలు అన్నిటిని చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కూడా బాలకృష్ణ రామారావు సెంటిమెంట్ మాత్రం వదలడం లేదు అనిపిస్తోంది.

Leave a comment