బాల‌య్య 105కు క్లాసిక్ టైటిల్‌..

191

యువరత్న నందమూరి బాలకృష్ణ తాజా ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ తరఫున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వ‌చ్చేయడంతో బాలయ్య మళ్లీ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 105 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రెండేళ్ల క్రితం బాలయ్య కాంబినేషన్లో వచ్చిన జై సింహా సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది.

కేఎస్‌.ర‌వికుమార్ టేకింగ్ న‌చ్చ‌డంతో బాల‌య్య బోయ‌పాటి లాంటి హిట్ డైరెక్ట‌ర్ల‌ను కాద‌ని కాదని ఆయనకు ఛాన్స్‌ ఇవ్వటం టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారింది. ఇక ఈ సినిమా టైటిల్ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ఈ మూవీకి టైటిల్ కూడా ఒకటి అనుకున్నారట. “క్రాంతి” అనే ఓ క్లాసిక్ టైటిల్ ఈ మూవీకి పెట్టాలని భావిస్తున్నార‌ట‌. ఇంత‌కు ముందు ఈ సినిమాకు రూర‌ల్ టైటిల్ ప‌రిశీలించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఈ యేడాది వ‌చ్చిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు రెండు ఆశించినంత ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేదు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని బాల‌య్య క‌సితోనే ఉన్నాడు.

ఈ సారి త‌న ఫ్యాన్స్‌ను ఫిదా చేసేందుకు బాల‌య్య‌ స్క్రిప్ట్ దగ్గరి నుంచి టైటిల్ వరకు అన్నీ ఆసక్తికరంగా ఉండాలని ఆయన అంటున్నారట. అందుకే దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ రెడీ చేసిన స్క్రిప్ట్ లో బాలయ్య ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు సూచించాడట. ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉండే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ తరహాలో ఉంటుందట. ఇప్పుడు 2004లో వచ్చిన లక్ష్మీ నరసింహా సినిమాలోని హీరో పాత్ర ఎలా ? ఉంటుందో ఇప్పుడు క్రాంతి సినిమాలో హీరో రోల్‌ కూడా అలాగే ఉంటుందని తెలుస్తోంది.

Leave a comment