Gossipsఅనుష్క భాగమతి సత్తా ఇది..! 1st డే కలెక్షన్స్

అనుష్క భాగమతి సత్తా ఇది..! 1st డే కలెక్షన్స్

ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓ వన్నె తెచ్చిన హీరోయిన్ అనుష్క. అప్పటిదాకా కమర్షియల్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క అరుంధతి సినిమాతో ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. కోడి రామకృష్ణ డైరక్షన్ లో వచ్చిన అరుంధతి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేలా కలక్షన్స్ సాధించింది. ఇక ఆ తర్వాత నుండి అనుష్క లీడ్ హీరోయిన్ గా చేసే సినిమాలంటే ఆడియెన్స్ లో ఓ రకమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక నిన్న రిలీజ్ అయిన భాగమతి సినిమా కూడా అంచనాలకు తగినట్టే సినిమా ఉందని టాక్ వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న భాగమతి మొదటి రోజు సత్తా చాటిందని చెప్పొచ్చు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమా మొదటి రోజు 5 కోట్ల దాకా షేర్ సాధించిందని తెలుస్తుంది. మొదటి రోజు ఓ స్టార్ సినిమా వసూళ్లను తలపించేలా అనుష్క భాగమతి కలక్షన్స్ ఉన్నాయి.

తెలుగు రెండు రాష్ట్రాల్లో 500 థియేటర్స్ పైగా రిలీజ్ అయిన అనుష్క భాగమతి కచ్చితంగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చి పెడుతుదని అంటున్నారు. రుద్రమదేవి తర్వాత అనుష్క క్రేజ్ ను మరింత పెంచేలా ఈ భాగమతి సత్తా చాటింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news