Gossipsతారక్‌ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..!

తారక్‌ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..!

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ సినిమా అంటే డైలాగ్స్, ఫైట్స్ తో పాటుగా తారక్ డ్యాన్స్ లు ఆశితారు.

అయితే ఈసారి ఆ విషయంలో అది నిరాశ పరుస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఫారిన్ షెడ్యూల్ లో ఏర్పరచిన ఓ పాటని మొత్తానికి క్యాన్సిల్ చేశారట. సో సినిమా మొత్తం మీద కేవలం 4 సాంగ్స్ ఉంటాయని అంటున్నారు. అందులో ఒకటి బ్యాక్ గ్రౌండ్ థీం సాంగ్ అట. అంటే సినిమాలో ఉండేవి 3 పాటలే.

అందులో ఒకటి మాత్రమే హీరో సోలో సాంగ్ ఆ ఒక్క పాటలోనే ఎన్.టి.ఆర్ డ్యాన్స్ చేస్తాడు. మొత్తానికి సినిమాలో సాంగ్ క్యాన్సిల్ చేసి నిర్మాత వ్యయాన్ని తగ్గించినా సినిమా ఫలితంపై ఇది ఏమాత్రం ప్రభావితం చూపిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news