‘బాహుబలి-2’ నాలుగు వారాల తెలుగు స్టేట్స్ కలెక్షన్స్.. 200 కోట్లకు చాలా చేరువలో!

baahubali-four-weeks-collec

‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రిలీజయ్యి నాలుగు వారాలు పూర్తయ్యింది.. ఇప్పటికీ ఆ సినిమా తన కలెక్షన్ల సునామీని కొనసాగిస్తూనే వుంది. తనకు పోటీగా బరిలోకి దిగుతున్న సినిమాలను తొక్కేస్తూ.. డీసెంట్ వసూళ్లతో దూసుకెళుతోంది. వీకెండ్స్‌లో రప్ఫాడిస్తూ.. వీక్ డేస్‌లలో చెప్పుకోదగిన స్థాయిలో దుమ్ముదులిపేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొత్తగా రిలీజవుతున్న సినిమాలకంటే ‘బాహుబలి’కే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. దీన్నిబట్టి.. ఈ సినిమా ఏ రేంజులో ఆడియెన్స్‌ని అలరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం నాలుగు వారాల్లో రూ.187.51 కోట్లు (షేర్) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఈ చిత్రానికి ప్రజాదరణ బాగానే వస్తోంది కాబట్టి, రూ.200 కోట్లలో చేరిపోవడం ఖాయమని విశ్లేషకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. మొత్తానికి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా ‘బాహుబలి-2’ పరుగులు తీస్తోందన్నమాట. ఆ క్లబ్‌లోకి ఈ చిత్రం ఎంటరైతే మాత్రం, టాలీవుడ్‌లో అదొక చెరగని హిస్టారికల్ రికార్డ్‌గా నిలిచిపోనుండడం ఖాయం. ఏరియాలవారీగా 4 వారాల కలెక్షన్స్ క్రింది విధంగా వున్నాయి.. (కోట్లలో)

నైజాం : 63.63
సీడెడ్ : 33
వైజాగ్ : 24.79
గుంటూరు : 17.01
ఈస్ట్ గోదావరి : 16.35
కృష్ణా : 13.43
వెస్ట్ గోదావరి : 11.86
నెల్లూరు : 7.44
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 187.51 కోట్లు

Leave a comment