బాహుబలి దర్శకుడు రాజమౌళి సైతం అసూయ పడ్డ ఆ కుర్ర దర్శకుడు ఎవరో తెలుసా ??

rajamouli-hails-mahanati-di

బాహుబలి లాంటి సినిమా తీసిన దర్శక దిగ్గజం రాజమౌళి తన మనసుకి నచ్చిన సినిమా ఏదొచ్చినా సరే దాని గురించి మాట్లాడేందుకు ముందుంటాడు. ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మహానటి సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేసిన రాజమౌళి అల్లు అరవింద్ ఇచ్చిన తేనేటి విందు పార్టీలో మరోసారి సినిమాను, దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తాడు.

సినిమా రిలీజ్ కు నాలుగు రోజులు ముందు కూడా సినిమా మీద తనకు అంత ఎక్సైటింగ్ లేదని కాని సినిమా చూశాక తెలిసిందని అన్నారు. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ జెమిని గణేషన్, సావిత్రి గార్ల పాత్రలను డీల్ చేసిన విధానం రైటింగ్ స్కిల్స్ అద్భుతమని అన్నారు. ఇక కొన్ని సినిమాలు వాటిని తీసిన దర్శకులను చూస్తే తనకు జలస్ కలుగుతుందని అలాంటి దర్శకులలో నాగ్ అశ్విన్ ఒకరని.. ఇలాంటి సినిమా తాను కూడా తీయలేనేమో అన్న విధంగా తను తీశాడని అన్నారు రాజమౌళి. ఇక సినిమా క్రెడిట్ అంతా అశ్వనిదత్ గారు తీసుకోవడం ఏమి బాగాలేదని. వారి పిల్లలు సాధించిన విజయం ఇదని అన్నారు.

Leave a comment