అ!.. అదరగొడుతుంది..!

awe-movie-collections

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా తొలిప్రయత్నంగా చేసిన సినిమా అ!. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కాజల్, నిత్యా మీనన్, రెజినా, ఈషా రెబ్బలతో పాటుగా అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శిలు నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియెన్స్ నుండి మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్ లో బాగా రన్ అవుతుంది.

ప్రీమియర్స్ తో సత్తా చాటిన అ!.. గురువారం 126851 డాలర్స్ వసూళు చేయగా.. శుక్రవారం 140629 డాలర్స్ వసూళ్లను రాబట్టింది. అమెరికాలో ఇప్పటికే హాఫ్ మిలియన్ వసూళను రాబట్టిన అ! సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధించిన సినిమా వరుసలో 21వ సినిమాగా నిలిచింది. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు 3.6 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించింది. 1.7 కోట్ల షేర్ వాల్యూ తో దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్లు సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా వసూళ్ల హవా కొనసాగిస్తుంది. నాని సినిమాలకే కాదు నాని నిర్మించిన సినిమాలకు కూడా ఓవర్సీస్ లో బాగా క్రేజ్ ఏర్పడింది.

Leave a comment