ఏరియాల వారీగా అ!.. వీకెండ్ వసూళ్లు .. నిర్మాతగా నాని కి అన్ని వైపులా లాభాలు !

awe-movie-3-days-collection

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా అ!. ఫిబ్రవరి 16న రిలీజ్ అయిన ఈ సినిమా కొత్త ప్రయత్నంగా వచ్చింది. ఎవరు ఊహించని కథా కథనలాతో వచ్చిన అ!. ఫైనల్ గా ఆడియెన్స్ ను కూడా అ!శ్చర్యపడేలా చేసింది. ఇక ఈ సినిమా కలక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. ప్రీమియర్స్ దగ్గర నుండి మల్టీప్లెక్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలక్షన్స్ కూడా బాగున్నాయి.

ఇక ఈ సినిమా వారాంతరంలో 9.4 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేయగా.. 4.5 కోట్ల షేర్ వాల్యూ సాధించింది. ఇక ఏరియా వైజ్ అ! కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం : 1.10 కోట్లు

వైజాగ్ : 29 లక్షలు

ఈస్ట్ : 22 లక్షలు

వెస్ట్ : 15 లక్షలు

కృష్ణా : 25 లక్షలు

గుంటూర్ : 21 లక్షలు

నెల్లూరు : 6 లక్షలు

సీడెడ్ : 22 లక్షలు

తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.5 కోట్ల షేర్ సాధించగా.. యూఎస్ లో 1.50 కోట్లు, కర్ణాటక 35 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 15 లక్షలు కలక్షన్స్ సాధించింది.. ఇక వరల్డ్ వైడ్ టోటల్ కలక్షన్స్ 4.5 కోట్ల దాకా రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా నానికి నిర్మాతగా ఓ మంచి అనుభూతిని కూడా ఇచ్చింది.

Leave a comment