Gossipsసూపర్ డెసిషన్ : అనుష్క ఆ క్యారెక్టర్లు చేయదట!!

సూపర్ డెసిషన్ : అనుష్క ఆ క్యారెక్టర్లు చేయదట!!

సూప‌ర్ ఫేం అనుష్క కెరియ‌ర్  కి సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు వెలువ‌స్తోంది. క‌థానాయిక ప్రాధాన్య చిత్రాల‌కు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మ‌డు

చేతిలో సినిమాలు లేవ‌న్న ప్ర‌చారం ఉంటే ఉండ‌నీ కానీ  ఓ స్థాయి త‌గ్గ పాత్ర‌లు మాత్ర‌మే చేస్తాన‌ని తేల్చి చెబుతోంది. అస‌లు త‌న‌కు అరుంధ‌తి లాంటి చిత్రం ద‌క్క‌డ‌మే అదృష్ట‌మ‌ని, దానికి కొన‌సాగింపుగా బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి సినిమాలు చేయ‌డం ఇంకా ఆనందంగా ఉంద‌ని అంటోంది.

ప్ర‌స్తుతం పిల్ల జ‌మిందార్ ఫేం అశోక్ డైరెక్ష‌న్లో భాగ‌మ‌తి సినిమా చేస్తోంది.ఆకలితో ఉన్నప్పుడు ఏది తిన్నా రుచిగానే ఉంటుంది. ఆకలి తీరిన తరవాతే… కొత్త రుచుల కోసం అన్వేషిస్తాం. నా సినీ కెరీర్‌కీ ఇది వర్తిస్తుందని చెబుతూ త‌న న‌ట‌నా ప‌రిధిని విస్తృతం చేసే సినిమాల‌పైనే  మ‌న‌సు పెడ‌తానంటోంది. ఏదేమైన‌ప్ప‌టికీ క‌థ‌ల ఎంపిక విష‌యంలో నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రిస్తానని తేల్చి చెబుతోంది.ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకొంటే..ఇప్పటి వరకూ చేసిన మంచి పాత్రల్ని హేళన చేసినట్టే అని త‌న మ‌నోగ‌తం వ్య‌క్తం చేస్తోంది. ప‌దేళ్ల కెరియ‌ర్ లో గ్లామ‌ర్ షోకే ప‌రిమితం కాక మంచి చిత్రాల‌కే ప్రాధాన్యం ఇచ్చిన ఈ భామ‌, ఇప్పుడు త‌నలో న‌టిని ఇంకా ఇంకా సంతృప్త ప‌రిచే పాత్ర‌ల‌కే ఓటేస్తాన‌న‌డం ఆమె వ్య‌క్తిత్వానికి తార్కాణం.వచ్చే ఏడాది విడుద‌ల‌య్యే భాగ‌మ‌తి సినిమా విజ‌యంపైనే ఆమె పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుందాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news