Gossipsపెళ్ళాం కావాలంటూ ఆర్య ఏమి చేసాడో తెలుసా ..?

పెళ్ళాం కావాలంటూ ఆర్య ఏమి చేసాడో తెలుసా ..?

ఇది వరకు పెళ్లిళ్లు చేసుకోవాలంటే సంబంధాలకు తిరగడం, పెళ్లిళ్ల పేరయ్యల చుట్టూ తిరగడం ఇంత తతంగం ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు అలా కాదు ఎవరికి వారే  చూసేసుకుంటున్నారు. కానీ ఒక తమిళ హీరో మాత్రం ఇంకో అడుగు ముందుకు వేసి ఏకంగా నాకు పెళ్ళాం కావాలంటూ ఏకంగా  ఒక వీడియో తయారుచేసి , ఫోన్ నెంబర్ తో సహా వివరాలు పెట్టాడు. ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగానే మారింది.

తమిళ్ యంగ్ హీరో ఆర్యకు భార్య కావాలట. ఇందుకోసం ‘తనకు జీవిత భాగస్వామి కావాలని కోరుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భాగస్వామి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్లు, షరతులు లేవు. నేను మీకు నచ్చితే, మంచి భర్త అవుతాననే నమ్మకం ఉంటే 73301 73301 నెంబర్‌కి కాల్ చేయండి. ఇది జోక్ కాదు. జిమ్మిక్కు కాదు. నా జీవితానికి సంబంధించిన విషయం. దయచేసి కాల్ చేయండి. మీ కాల్ కోసం ఎదురుచూస్తున్నా!’ అని ఆర్య వీడియోలో తెలిపాడు.

Hi Friends 😊 Finally In search of my Life Partner 😍😍😍#MySoulmate ❤❤❤️ pic.twitter.com/zq88lIoglY
— Arya (@arya_offl) November 21, 2017

ఆర్య వీడియోలో చెప్పిన నెం. కు కాల్ చేస్తే మీకొక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో ఆర్య మాట్రిమోని వెబ్‌సైట్ www.mapillaiarya.com లింక్ ఉంటుంది. ఆ సైట్లో తనకు వివరాలు పంపాలని సూచించాడు. ఇప్పటికే ఆర్య కు భార్య అయ్యేందుకు వెబ్ సైట్ లో అమ్మాయిలు వివరాలు నమోదు చేస్తున్నారు. మరీ.. ఈ యంగ్ హీరోని పెళ్లాడే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news