అర్జున్ రెడ్డిపై ఆ ధైర్యం చేసిన స్టార్ మా..!

arjun reddy movie details

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. రిలీజ్ ముందు ముద్దు సీన్లతో నానా రచ్చ చేసిన అర్జున్ రెడ్డి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న యువతను బాగా ఆకట్టుకుంది. తద్వారా 4 కోట్ల బడ్జెట్ లోపే తెరకెక్కిన ఈ సినిమా 40 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా భారీ రేంజ్ లో అమ్ముడయ్యాయి.

తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా 3.5 కోట్ల దాకా పలికాయని టాక్. ఇక అడల్ట్ కంటెంట్ గా అనిపించే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ చూడటం కష్టం అయినా సరే జీ తెలుగులో పోటీ పడి మరి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుందట స్టార్ మా. బుల్లితెర ఆడియెన్స్ కు ఈ సినిమా మంచి కిక్ ఇస్తుందనే నమ్మకంతో స్టార్ మా ఈ ధైర్యం చేసింది.

విజయ్, షాలిని పాండే లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఊహించిన దాని కన్నా భారీ హిట్ సాధించింది. అందుకే స్టార్ మా కూడా ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గలేదు.

Leave a comment