అజ్ఞాతవాసి ఫ్లాప్ తో లాభాల్లో ఎన్టీఆర్,త్రివిక్రమ్..!

117

ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా ఈ గురు వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బిజినెస్ పరంగా భారీ రేంజ్ చూపిస్తుంది. పబ్లిసిటీ ఖర్చుతో కలుపుకుని ఈ సినిమాకు 93 కోట్ల ఖర్చు కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 130 కోట్ల పైనే జరిగిందట. థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాదు శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ అన్ని కలిపి ఈ రేటని తెలుస్తుంది.

అజ్ఞాతవాసి ఫ్లాప్ అవడంతో నిర్మాత రాధాకృష్ణ డిస్ట్రిబ్యూటర్స్ కు తిరిగి డబ్బులు ఇచ్చాడు. అందుకే ఇప్పుడు ఆయన చెప్పిన రేటుకే అరవింద సమేత కొనేశారట. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ మొదటి కాంబినేషన్.. ట్రైలర్ అదరగొట్టేయడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అందుకే రిలీజ్ కు ముందే అరవింద సమేత ఎలా లేదన్నా ఓ 40 కోట్లు లాభం తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు.

పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న అరవింద సమేత సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment