” అరవిందసమేత ” రెండురోజుల కలెక్షన్స్… సునామి సృష్టిస్తున్న వీర రాఘవ..

137

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమాకు వసూళ్ల వరద పారుతోంది.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైన్ గా దూసుకొచ్చిన ఈ సినిమా వసూళ్ల దగ్గర కూడా అదే రేంజ్ లో ఊపు చూపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న సినిమా కలెక్షన్ రికార్డ్స్ ను మించిపోయింది.
1
పాజిటివ్ బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్స్‌లో పెద్ద సినిమాల హడావిడి లేకపోవడం.. సింగిల్‌గా బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది.
2
అరవింద సమేత మొదటి రోజు కలెక్షన్ భారీగానే వచ్చింది. ఇక రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో బాక్స్ ఆఫీసు వద్ద రెండు రోజుల పాటు రూ. 34.60 కోట్లు వసూల్ చేసింది. తారక్ ఫెరఫామెన్స్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు సీమ యాసలో ఎన్టీఆర్ చెప్పడం అందరిని ఆకట్టుకుంది.
ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం : 8.55 కోట్లు
సీడెడ్ :7.45 కోట్లు
వైజాగ్: 4.01 కోట్లు
ఈస్ట్:3.24 కోట్లు
వెస్ట్:2.69 కోట్లు
గుంటూరు: 4.82 కోట్లు
కృష్ణ: 2.51 కోట్లు
నెల్లూరు: 1.33 కోట్లు

ఏపి, తెలంగాణ: 34.60 కోట్లు

Leave a comment