ఫ్యాన్స్ జేబులకు చిల్లుపెట్టబోతున్న ఎన్టీఆర్..!

104

దసరా బరిలో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిధ్దం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత టికెట్ రేట్లు ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయిపోయాయి. మేజర్ ఏ అండ్ క్లాస్ సెంటర్స్ అన్నింటిలో యావరేజ్ టికెట్ రేటు 200 కి ఫిక్స్ చేశారట..ఇక బి సి సెంటర్స్ లో థియేటర్ రేంజ్ ని బట్టి 100 నుండి 150 వరకు రేట్లు ఉంటాయని తెలుస్తుంది.
2
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి వారం ఈ చిత్రానికి అధికారికంగానే టికెట్ల రేట్లు పెరగబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక సినిమా ఎలాంటి కాంబినేషన్లో తెరకెక్కితే ఏంటి..? దానికి ఎంత బడ్జెట్ పెడితే ఏంటి.. బయ్యర్లు ఎంతకు కొంటే ఏంటి.. టికెట్ల రేట్లు పెంచుకుని ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టే అవకాశం ప్రభుత్వం కల్పించడం ఇటీవల కాలంలో చాలా ఎక్కువయ్యింది. ఒకరిని చూసి ఒకరు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం వారు ఒకే చెప్పడం షరా మామూలే అయిపొయింది. ఇక అరవింద సమేత భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో మొదటి వారంలోనే ఆ వసూళ్లతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవాలని బయ్యర్లు భావిస్తున్నారు.
1

Leave a comment