Gossipsఅభిమానుల సత్తా ఇది..అల్ ఇండియా లెవెల్ లో అరవింద సమేత టీజర్...

అభిమానుల సత్తా ఇది..అల్ ఇండియా లెవెల్ లో అరవింద సమేత టీజర్ ఎన్నో స్థానంలో ఉందొ తెలుసా..?

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ టీజర్ ఈరోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేశారు. టీజర్ తో ఈ సినిమా అంచనాలను మరింత పెంచేశారు. 9 గంటలకు రిలీజ్ అవగా కేవలం 10 నిమిషాల్లో 50 వేల లైకులతో సంచలనం సృష్టించింది. ఇది ఖచ్చితంగా యంగ్ టైగర్ స్టామినాకు నిదర్శనమని చెప్పొచ్చు. నవరస కళాపోషకుడిగా నటనకు పరిపూర్ణత తెచ్చేలా తన నట విశ్వరూపం చేస్తున్న ఎన్.టి.ఆర్ అరవింద సమేతతో మరోసారి రికార్డుల ఊచకోత మొదలు పెట్టాడు. 6

7

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే అంతర్జాలాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటివరకు 3 మిలియన్స్ మార్క్ దాటేసిన ఈ టీజర్ మరింత దూసుకెళ్తుంది. మహేష్ భరత్ అనే నేను టీజర్ 16 నిమిషాల్లో 50 వేల లైకులు అందుకోగా.. పవన్ అజ్ఞాతవాసి 14 నిమిషాల్లో 50 వేల లైకులు వచ్చింది. ఈ ఇద్దరికన్నా ముందు కేవలం ఎన్.టి.ఆర్ అరవింద సమేత 10 నిమిషాల్లో 50 వేల లైకులు తెచ్చింది. చూస్తూ ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల రచ్చ చేసేలా ఉంది.

5

4

3

2

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news