Gossipsస్టోరీ లీక్ చేసిన సునీల్..ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

స్టోరీ లీక్ చేసిన సునీల్..ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

కమెడియన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సునీల్ ఆ ఇమేజ్ తో హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. హీరోగా మొదట్లో కాస్త పర్వాలేదు అనిపించినా తర్వాత మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు. అందుకే మళ్లీ కమెడియన్ గా కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడు. లేటెస్ట్ గా అల్లరి నరేష్ తో సిలీ ఫెల్లోస్ సినిమా చేస్తున్న సునీల్ ఆ తర్వాత అరవింద సమేత సినిమాలో కూడా కమెడియన్ గా చేస్తున్నాడు.
2
అరవింద సమేత సినిమాలో అతని రోల్ అచ్చం అతడు సినిమాలో స్నేహితుడి పాత్రలా ఉంటుందట. త్రివిక్రం డైరక్షన్ లో అతడు సినిమాలో మహేష్ స్నేహితుడిగా సునీల్ నటించాడు. సేం అలానే ఇప్పుడు అరవింద సమేతలో కూడా సునీల్ పాత్ర అలానే ఉంటుందట. ఈ సినిమా హిట్ అయితే కమెడియన్ గా మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.
1
ఎలాగు బ్రహ్మానందం ఫాంలో లేడు.. ఆయనతో ఈక్వల్ ఇమేజ్ సంపాదించిన సునీల్ కామెడీ చేస్తానంటే అతని కోసం సరికొత్త కామెడీ పాత్రలు సృష్టించే అవకాశం ఉంటుంది. మరి అరవింద సమేత సునీల్ కు కమెడియన్ గా గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news