Moviesఅరవింద సమేత మరో సింహాద్రి.. హైలెట్స్ ఇవే..

అరవింద సమేత మరో సింహాద్రి.. హైలెట్స్ ఇవే..

త్రివిక్రం డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా అరవింద సమేత. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే భారీ అంచనాలు పెంచింది. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం అరవింద సమేత సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవనున్నాయట. ఓ రకంగా సింహాద్రి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎంత అద్భుతంగా ఉంటుందో అలానే అరవింద సమేత సినిమాలో కూడా అదే రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయట. ఇవి కచ్చితంగా నందమూరి అభిమానులను అలరించేలా ఉంటాయట.

కొన్నాళ్లుగా ఫ్యాక్షన్ కథలకు దూరంగా ఉన్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో మళ్లీ అలాంటి మూవీ చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఎన్.టి.ఆర్ సత్తా చాటుతున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news