Gossipsఅరవింద సమేత 5 వ సాంగ్ : రెడ్డమ్మ తల్లి (వీడియో)

అరవింద సమేత 5 వ సాంగ్ : రెడ్డమ్మ తల్లి (వీడియో)

అరవింద సమేతలోని రెడ్డమ్మ తల్లి సాంగ్ ఎంతటి ఎమోషనల్ గా సాగిందో అందరికి తెలిసిందే. త్రివిక్రం ఇదవరకు ఎప్పుడు బలంగా ఎమోషన్ చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన మాటల్లోనే ఎమోషన్, కామెడీ అర్ధమయ్యేవి. ఇక అరవింద సమేతలో వీరత్వానికి కొత్త అర్ధం చెప్పాడు ఎన్.టి.ఆర్.

సినిమాలోని రెడ్డమ్మ తల్లి సాంగ్ పెంచల్ దాస్ పాడాడు. ఆ సాంగ్ సినిమాకు ఎంత పెద్ద అసెట్ అన్నది సినిమా చూసిన వారికి అర్ధమవుతుంది. కథకు చాలా అవసరమైన సందర్భంలో రెడ్డమ్మ తల్లి పాట మనసులను కదిలిస్తుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ పెంచల్ దాస్ రాసి పాడటం జరిగింది.

ఈ సినిమాలోని ఈ సాంగ్ కవర్ వర్షన్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెంచల్ దాస్ పాడిన విధానం చూస్తే గుండె బరువెక్కేలా చేస్తుంది. పెంచల్ దాస్ పాడుతుంటే తమన్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక త్రివిక్రం, రాధాకృష్ణ పక్కన కూర్చుని చూస్తున్నారు. సినిమా ఘన విజయం సాధించగా సినిమాను మరింత ప్రమోట్ చేసేలా ఈ సాంగ్ ప్రేక్షకుల దగ్గరకు చేరుకునేలా రిలీజ్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news