‘అరవిందసమేత’ పబ్లిక్ టాక్..అదిరిపోయే ట్విస్ట్ లు…

132

అదిరిపోయే ట్విస్ట్ లు .. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘అరవింద సమేత’ ఎవరినీ నిరాశపరచకుండా… బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే … బొమ్మ సూపర్ హిట్ అనే పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. సునీల్ జరిగిన కథ చెబుతుండటంతో సినిమా మొదలైంది. ఆ తర్వాత జగపతి బాబు , నాగ బాబు ల వర్గాల మధ్య ఫ్యాక్షన్ సన్నివేశాలు చూపించాడు దర్శకుడు. అవి అదిరిపోయాయి. జగపతి బాబు కొడుకుగా నవీన్ చంద్ర కనిపించాడు.

వీర రాఘవుడి గా ఎన్ టీఆర్ చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్టాఫ్ లో ఫ్యాక్షన్ కుటుంబం, వారి నేపథ్యం, వాళ్ల మధ్య ఫన్నీ సన్నివేశాలని చూపించాడు త్రివిక్రమ్. దీంతో పాటు అదిరిపోయే రెండు యాక్షన్ ఏపీసోడ్స్, ఒకట్రెండు ట్విస్టులతో ఫస్టాఫ్ అదరగొట్టేసింది.

సెకాంఢాఫ్ లో పూజా-ఎన్టీఆర్ ల మధ్య కథ దిశని మార్చేసింది. వీర రాఘవుడి శాంతి కోసం ప్రయత్నాలు మొదలెట్టడం.ఎన్టీఆర్ -రావు రమేష్ ల ఏపీసోడ్ లో త్రివిక్రమ్ మాటల పదను కనిపించింది. క్లైమాక్స్ లో ఓ యాక్షన్ ఏపీసోడ్, ఓ ట్విస్టుతో సినిమాని అద్భుతంగా ముగించాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ స్టామినాను నమ్ముకొండి. త్రివిక్రమ్‌ ప్రతిభ మ్యాజిక్ చేస్తుంది. అరవింద సమేత మిమ్మల్ని ఎక్కడా నిరూత్సాహపరుచదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. జీవితంలో శాంతి అనేది ఎంత ప్ర‌ధాన‌మో చెప్పే క‌థ ఇది. ఎన్టీఆర్ బెస్ట్ ఫెరఫామెన్స్ ఇచ్చాడు

Leave a comment