Gossipsజాతకాలని నమ్ముకుంటున్న అరవింద సమేత టీం..?

జాతకాలని నమ్ముకుంటున్న అరవింద సమేత టీం..?

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో క్రేజీ మూవీ గా వస్తున్న అరవింద సమేత సినిమా ఆడియో వేడుక లేకుండానే ఆన్ లైన్ లో సాంగ్స్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 11న రిలీజ్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్ అక్టోబర్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారు. అయితే ఈ వేడుక పూర్తిగా జాతకాల ఆధారంగా జరుపుతున్నారట.

ముఖ్యంగా ఎన్.టి.ఆర్ జాతకం ప్రకారంగా అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.

దసరా వేడుకకు నందమూరి ఫ్యాన్స్ సంబరాలు డబుల్ అయ్యేలా అరవింద సమేత రిలీజ్ కాబోతుంది. ప్రతిసారి దసరాకు తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్న తారక్ ఈ దసరాకు హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news