ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..!

31

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా నుండి వినాయక చవితి స్పెషల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆడియో రిలీజ్ పై వచ్చిన అనుమానాలన్నిటిని పటాపంచలు చేస్తూ అరవింద సమేత లేటెస్ట్ పోస్టర్ అదరగొట్టేసింది. ఈ పోస్టర్ లో ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్ తో పాటుగా సెప్టెంబర్ 20న ఆడియో రిలీజ్ అని కన్ ఫాం చేశారు.
1
అయితే కొన్నాళ్లుగా ఆడియో వేడుక క్యాన్సిల్ అని.. డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుందని అన్నారు. ఆ వార్తలన్నిటికి బ్రేక్ చేస్తూ సెప్టెంబర్ 20 ఆడియో రిలీజ్ మెన్షన్ చేశారు. ఇక లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ అరవింద సమేత పోస్టర్ కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Leave a comment