‘అరవింద సమేత’మొన్న ఫోటోలు ..ఇప్పుడు డైలాగ్స్ లీక్..!

53

లీకేజ్..లీకేజ్..ఇప్పుడు ఈ పదం వింటుంటే..సినీ పరిశ్రమ వణికిపోతుంది. ఎంతో ఖర్చుపెట్టి నటీనటులతో నానా కష్టాలు పడి నటింపజేసి..ఇక థియేటర్లో చూపించి మంచి రెస్పాన్స్ పొందాలని చూస్తున్న దర్శక, నిర్మాతలు ఒకరకంగా కన్నీరు పెట్టుకునే పరిస్థితికి తీసుకు వస్తున్నారు లీకు బేవార్స్ గాళ్లు. సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి సినిమా పూర్తయి థియేటర్లోకి వచ్చే వరకు ఎప్పుడు ఎక్కడ ఏది లీక్ అవుతుందో అని తెగ భయపడిపోతున్నారు చిత్ర యూనిట్. ఒకదశలో ఫోటోల దగ్గర నుండి.. వీడియోలు .. కథ.. డైలాగులు.. చివరకు సినిమాలే లీకు అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సినీ పరిశ్రమకు చెందిన కొంతరు పెద్దలు జోక్యం చేసుకొని సైబర్ పోలీసులకు, ప్రభుత్వానికి కూడా ఫిర్యాలు చేస్తున్నా..ఈ లీకేజీల గోల మాత్రం ఆపలేక పోతున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా చేస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని మొదటగా ఒక ఫోటో లీక్ కావడం పెను సంచలనాలకు దారి తీసింది..ఆ తర్వాత మరో ఫోటో ఇలా వరుసగా ఫోటోలు లీక్ కావడం..సోషల్ మీడియాలో రక రకాల కథనాలు రావడం జరిగింది. దాంతో ఫోన్లు కానీ ఏ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానీ షూటింగ్ స్పాట్ లో లేకుండగా త్రివిక్రమ్ అండ్ టీమ్ తగు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఇక గీతా గోవిందం సినిమానే లీక్ కావడంతో ఈ భయం మరీ పట్టుకుంది ‘అరవింద సమేత’చిత్ర యూనిట్ సభ్యులకు.

రేపు వచ్చే టీజర్ ఎలాంటి లీకేజీల గోల లేకుండా చూస్తున్నారు. చిత్రయూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అరవింద సమేత సినిమాలోని డైలాగులంటూ కొన్ని డైలాగులు ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. అయితీ ఆ డైలాగులు ‘అరవింద సమేత’లోనేవే అయితే మాత్రం ఎన్టీఆర్ సినిమా మరో బీభత్సం సృష్టించడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఇప్పటికి సెట్ అవ్వటమే కాక అది కూడా రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్న విషయం తెలిసిందే. 3

4

2

1

Leave a comment