Moviesఎన్టీఆర్ వీర రాఘవలో.. ఆ లోటు కనిపించింది

ఎన్టీఆర్ వీర రాఘవలో.. ఆ లోటు కనిపించింది

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. దసరా బరిలో దమ్ము చూపించేలా వస్తున్న ఈ సినిమా ఆడియో ఈమధ్యనే రిలీజైంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఓకే అనిపించేలా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు తమన్ కాకుండా దేవి శ్రీ ప్రసాద్ అయితే ఎలా ఉంటుంది అనే విధంగా నందమూరి ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

దేవి మ్యూజిక్ అంటే ఇన్ స్టంట్ గా ఎక్కేస్తాయి. హీరో ఫాలోవర్స్ ను .. దర్శకుడు స్టోరీని.. ఇలా అన్ని సమతూకం వేసుకుని దేవి ఫ్యాన్స్ కోరుకునే మ్యూజిక్ అందిస్తాడు. అయితే అరవింద సమేతకు తమన్ మ్యూజిక్ సోసోగానే ఉందని రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో ఎలా ఉంటాయో కాని వినేందుకు మాములుగానే ఉన్నాయని అంటున్నారు. ఈ విధంగా ఈ దేవి శ్రీ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

పెనివిటి సాంగ్ లిరిక్స్ బాగున్నాయి.. అయితే ఆ పాట తప్ప మిగతా సాంగ్స్ నందమూరి ఫ్యాన్స్ కు ఏమంత కిక్ ఎక్కించినట్టు లేవు. మరి ఈ సినిమా మ్యూజిక్ అరవింద సమేత మీద ఏమాత్రం ప్రభావితం చూపిస్తాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news