బ్రేకింగ్ : అరవింద సమేత ఆడియో క్యాన్సిల్..

20

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నరన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా ఆడియోని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయాలని చూశారు. ఆడియో వేడుక జరుపాలని అనుకోగా అది కాస్త క్యాన్సిల్ అయ్యిందట.
2
డైరెక్ట్ గా ఆన్ లైన్ లో అరవింద సమేత సాంగ్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక అదే క్రమంలో అక్టోబర్ 1 నుండి 10 మధ్యలో అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆడియోని డైరెక్ట్ గా మార్కెట్ లోకి వదిలి రిలీజ్ ముందు ఓ భారీ వేడుక చేయాలని చూస్తున్నారు. ఇక ఈ ఫంక్షన్ కు గెస్టులుగా చంద్రబాబు, బాలకృష్ణ వస్తున్నారని తెలుస్తుంది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా కాబట్టి తిరుపతిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉందట. ఒకే వేదిక మీద నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో ఎన్.టి.ఆర్, బాలకృష్ణ, చంద్రబాబులు కలవడం అద్భుతమైన విషయమని చెప్పొచ్చు.

Leave a comment