Gossipsఅరవిందుడి జోరును దేవరకొండ తట్టుకోగలడా..?

అరవిందుడి జోరును దేవరకొండ తట్టుకోగలడా..?

యువ హీరో విజయ్ దేవరకొండ వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. గీతా గోవిందం హిట్ తో స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమా నోటాతో ఏకంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాకే పోటీగా వస్తున్నాడు. ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ఫిక్స్ చేయగా అక్టోబర్ 4న నోటాగా వస్తున్నాడు విజయ్ దేవరకొండ.
1
వార ముందు వస్తున్నా సరే తారక్ కు పోటీగా విజయ్ పెద్ద సాహసమే చేస్తున్నాడని చెప్పొచ్చు. మూడు సినిమాలు హిట్ కొట్టినా ఎన్.టి.ఆర్ ను ఢీ కొట్టేంత సీన్ ఉందా అని నందమూరి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే నోటా సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా వస్తుంది. ఆనంద్ రంగ డైరక్షన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సర్ ప్రైజ్ చేసింది.

సబ్జెక్ట్ బాగానే ఉన్నా విజయ్ వర్సెస్ ఎన్.టి.ఆర్ పోటీలో ఎవరు విజయపతాకాన్ని ఎగురవేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇదే కాదు దసరాకు రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ, విశాల్ పందెం కోడి 2 కూడా వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news