Gossips'అరవింద సమేత' ఐదో సాంగ్ సర్ ప్రైజ్!

‘అరవింద సమేత’ ఐదో సాంగ్ సర్ ప్రైజ్!

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆడియో ఇప్పటికే ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. అయితే నాలుగు పాటలే ఉన్నాయన్న అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. అందుకే ఆడియో ట్రాక్ లో లేని ఐదో పాట సినిమాలో ఉంటుందని అంటున్నారు. 6
ఈ పాట ఎన్.టి.ఆర్ డ్యాన్సింగ్ ఐటం అని తెలుస్తుంది. సాంగ్ కచ్చితంగా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఖుషి చేస్తుందని అంటున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మరి సర్ ప్రైజ్ గా ప్లాన్ చేసిన అరవింద సమేత ఐదో పాట నిజంగానే ఫ్యాన్స్ కు థ్రిల్ కలిగిస్తుందా లేదా అన్నది చూడాలి.

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news