అరవింద సమేత.. ఎన్టీఆర్ పూజ ల బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. మోషన్ పోస్టర్..! (వీడియో)

aravinda-sametha-motion-pos

ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచేసిన ఎన్.టి.ఆర్ త్రివిక్రం మూవీపై ఈ ఫస్ట్ లుక్ తోనే కథ ఇది అని కొందరు అల్లేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో టైటిల్ లో హీరోయిన్ పేరు ఉండటం అంటే సినిమాలో హీరోయిన్ ప్రాధాన్యత ఎంతో తెలుస్తుంది. ఇక ఈ అరవింద సమేతలో పూజా హెగ్దె అరవింద పాత్రలో నటిస్తుందని చెప్పకనే చెప్పారు.

ఇక వీర రాఘవగా ఎన్.టి.ఆర్ విశ్వరూపం చూపించనున్నాడు. ఎన్.టి.ఆర్ లుక్, సిక్స్ ప్యాక్ చూస్తే త్రివిక్రం తన ఇదవరకు సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఎన్.టి.ఆర్ యాంగిల్ లో మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని చెప్పొచ్చు. అంతేకాదు టైటిల్ ను బట్టి చూస్తే ఇదో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయ్యే అవకాశం ఉందని. అందుకే అరవింద సమేత వీర రాఘవ అన్న టైటిల్ పెట్టి ఉంటారని చర్చిస్తున్నారు.

మొత్తానికి వరుస విజయాలతో దూసుకెళ్తున్న తారక్ త్రివిక్రం సినిమాతో ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తాడని టైటిల్ తోనే చెప్పేశాడు. మరి ఈ అరవింద సమేత వీర రాఘవ విన్యాసాలేంటో చూడాలంటే సినిమా రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే.

Leave a comment