ఎన్టీఆర్ అరవింద సామెత మాస్ లుక్..!

9

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సామెత వీర రాఘవ’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే, ఇక ఈ మూవీ పోస్టర్ యంగ్ టైగర్ అభిమానులని ఎంత గానో ఆకట్టుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ అంతటా అరవింద సామెత మూవీ లో ఎన్టీఆర్ లుక్ పై ప్రశంసలు కురిపించారు. ప్రముఖ కథానాయక పూజ హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కొన్ని రోజులుగా ఈ చిత్ర కథ ఇదే అంటూ ఒక వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.
ఈ చిత్ర కథ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఫస్ట్ లుక్ తోనే అర్ధం అవుతుంది, ఇందులో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటిస్తారని సమాచారం. సినిమా ఫస్ట్ హాఫ్ లో డీసెంట్ గా ఉండే సిద్దార్థ్ గౌతమ్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని, అటు తరువాత రెండవ భాగం లో యాంగ్రీ యాంగ్ మ్యాన్ గా మారిపోతారని సమాచారం. సినిమా రెండవ భాగం లో విలన్ తో కొన్ని బారి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మూవీ లో ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని తెలుస్తుంది. మూవీ ఫస్ట్ లుక్ కూడా సినిమా ఇంటర్వెల్ ముందే వచ్చే ఒక బారి యాక్షన్ సీన్ లోనిదట.
ఇక చాల రోజుల తరువాత ఎన్టీఆర్ పూర్తి మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో, ఎన్టీఆర్ అభిమానులకి ఇది ఎంతో సంతోషం కలిగించే వార్తే అని చెప్పాలి.

Leave a comment