” అరవింద సామెత ” న్యూ మోషన్ టీజర్

aravindha-sametha-look

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా ‘అరవింద సామెత’ వీర రాఘవ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ ఒక చేతిలో కత్తి పట్టుకుని నడుస్తూ రక్తం అంటిన ప్యాంటు తో షర్ట్ లేకుండా చక్కటి సిక్స్ ప్యాక్ తో కనిపించారు. అరవింద సామెత ఫస్ట్ లుక్ కి ఎన్టీఆర్ అభిమానులే కాకుండా టాలీవుడ్ ప్రముఖులు అంత ప్రశంసలతో ముంచెత్తారు. పూజ హేగ్దే తొలిసారిగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గ నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ అరవింద సామెత సినిమాని నిర్మిస్తున్నారు.

థమన్ ఎస్ ఎస్ స్వరాలూ సమకూర్చగా, ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాకి నిర్మాత గ వ్యవహరిస్తారు. రామ్ లక్ష్మణ్ ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ తెరకెక్కనుందని సమాచారం. ఈ సంవత్సరం దసరా పండుగ రోజున అరవింద సామెత సినిమాని విడుదల చేయాలనీ చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

ఇక ఈ మధ్యనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక పోస్టర్ ని నెట్ లో విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ఫ్యాన్ మేడ్ మోషన్ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఇందులో ఎన్టీఆర్ సీరియస్ లుక్ లో కనిపించారు.

Leave a comment