అమ్మతోడు..లీకైన డైలాగ్ వింటే.. రోమాలు లెగవాల్సిందే..!

ntr-dialogues

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే చాన్నాళ్ల తర్వాత ఎన్.టి.ఆర్ ను మాస్ లుక్ లో చూశామన్న ఫీలింగ్ కలిగింది నందమూరి ఫ్యాన్స్ కు. ఇక ఫస్ట్ లుక్ నుండే సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు ఈ సినిమా నుండి లీకైన డైలాగ్ మరింత సంచలనంగా మారింది.

త్రివిక్రం మార్క్ డైలాగ్ పవర్ తో వస్తున్న అరవింద సమేత సినిమా నుండి మాది రాయలసీమ.. నమ్మిత ప్రాణాలు ఇస్తాం.. నమకద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం.. అనే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ డైలాగ్ ను ఎన్.టి.ఆర్ ఏ రేంజ్ లో చెప్పుంటాడో అని ఫ్యాన్స్ ఊహల్లో తేలుతున్నారు.

ప్రతి నందమూరి ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ డైలాగ్ ఉంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Leave a comment