ఎన్.టి.ఆర్ తో అక్సా ఖాన్ డ్యాన్స్..!

ntr-aqsa-khan

ఢీ 10లో దుమ్మురేపిన అక్సా ఖాన్ ఏకంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో డ్యాన్స్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఢీ 10లో తన క్రేజీ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అక్సా ఖాన్ ఫైనల్ కంటెస్టంట్ గా రాకపోయినా తన డ్యాన్స్ తో షో మొదలైన నాటి నుండి ప్రేక్షకులను అలరించింది.

ఢీ 10కు తారక్ గెస్ట్ గా రావడమే కాకుండా స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశాడు తారక్. ఇందులో భాగంగా అక్సా ఖాన్ తో కలిసి స్టేజ్ మీద స్టెప్పులేశాడు తారక్. తారక్ పక్క అలా స్టెప్పులేసిన అక్సా ఖాన్ హీరోయిన్ గా కూడా ఛాన్స్ దక్కించుకుంటుందని చెప్పొచ్చు. ఈమధ్య నాని కూడా తన సినిమాలో ఓ డ్యాన్సర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. చూస్తుంటే అక్సా ఖాన్ బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ పై లక్కీ ఛాన్స్ కొట్టేస్తుందని చెప్పొచ్చు.

Leave a comment