నంది అవార్డుల్లో ‘మనం’కు అవమానం..!

Manam movie

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఎనౌన్స్ చేసిన 2014, 15, 16 సంవత్సరాలకు గాను నంది అవార్డుల ప్రకటనలో మనం సినిమాకు ఘోరమైన అవమానం జరిగిందని అంటున్నారు. 2014లో వచ్చిన మనం సినిమాకు కేవలం ఉత్తమ ద్వితీయ చిత్రంగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అయితే ఆ సినిమాకు ఇదో రకంగా అవమానమే అంటున్నారు సినిమా ప్రియులు.

జ్యూరీలో ఉన్న వారు ఇలా చేశారా లేక బాలకృష్ణ, నాగార్జునల మధ్య సత్సంబంధాలు లేవు కాబట్టి మనం కు ఇలా అన్యాయం చేశారా అన్న వాదన వినిపిస్తుంది. నాగ చైతన్యకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డ్ ప్రకటించారు. ఏది ఏమైనా మనం సినిమా అక్కినేని ఫ్యామిలీస్ అంతా కలిసి చేసిన అద్భుతమైన సినిమా. ఆ సినిమాకు నంది అవార్డుల్లో ఇంతటి అవమానం ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

 

Leave a comment