Gossipsఅనుష్కని బాగా వాడేస్తున్నారుగా..!

అనుష్కని బాగా వాడేస్తున్నారుగా..!

భాగమతి తర్వాత అనుష్క సైలెంట్ గా సైలెన్స్ అంటూ ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తుంది. కోనా వెంకట్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో మాధవన్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా అనుష్క నటిస్తుందని అంటున్నారు. ముందు వాయిస్ ఓవర్ వరకే పరిమిత అనుకున్న అనుష్కను స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించేలా చేస్తున్నారట.

సైరాలో అనుష్క స్పెషల్ సాంగ్ కచ్చితంగా సినిమాకు హెల్ప్ అవుతుంది. అదే సాంగ్ లో తమన్నా కూడా కాలు కదుపుతుందని తెలుస్తుంది. చిరు పక్కన అటు అనుష్క, ఇటు తమన్నా ఇద్దరు డ్యాన్స్ చేస్తారన్నమాట. అనుష్క క్రేజ్ కు ఇలాంటి చిన్న రోల్స్ అవసరం లేదు కాని ఆమె ఉంటే సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుందని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి సైరాలో ఆమెను తీసుకున్నారట.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news