మళ్లీ అనుష్క ఫాంలోకి వస్తుంది.. మీరు సర్ ప్రైజ్ అవడం గ్యారెంటీ..!

Anushka's new look goes viral

స్వీటీ అనుష్క లేటేస్ట్ వర్షన్ అదేనండి న్యూ లుక్ అదరగొట్టింది. ఆస్ట్రియా వెళ్లి మరి అక్కడ న్యాచురో థెరపి ద్వారా తన సైజ్ తగ్గించుకుంది అమ్మడు. మునుపటి రూపంతో అనుష్క ఇచ్చిన సడెన్ సర్ ప్రైజ్ అందరిని ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా అనుష్క ఫ్యాన్స్ అయితే అమ్మడి మేకోవర్ కు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇదిలాఉంటే అనుష్క కొత్త లుక్ గురించి ఇంతగా ఆలోచిస్తే ఇక తను చేసే సినిమాలో ఆమెను చూస్తే మీరు అవాక్కవుతారు అంటున్నాడు రచయిత, నిర్మాత కోనా వెంకట్.

రైటర్ గా కెరియర్ ఆపేసిన కోనా వెంకట్ ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు. నిన్ను కోరి, నీవెవరో సినిమాలను నిర్మించిన కోనా వెంకట్ అనుష్కతో సినిమా చేస్తున్నాడు. సీక్రెట్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో మాధవన్ కూడా నటిస్తున్నాడు. అనుష్క న్యూ లుక్ తో ఫ్యాన్స్ అందరు సర్ ప్రైజ్ అవగా ఇదేముందు సినిమాలో ఆమె లుక్ చూస్తే మీరు షాక్ అవడం ఖాయమని అంటున్నాడు కోనా వెంకట్.

సైజ్ జీరో తర్వాత బాహుబలి, సింగం-3, భాగమతి ఈ సినిమాల్లో అనుష్క లావుగానే కనిపించింది. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ అమ్మడు నాజుకుగా మారింది. ఇక దర్శక నిర్మాతలు మళ్లీ అనుష్కతో సినిమా కోసం క్యూ కట్టడం ఖాయం.

Leave a comment