Gossipsమెగాస్టార్‌తో బాహుబలి భామలు.. పాతరపెట్టాల్సిందే రికార్డులు!

మెగాస్టార్‌తో బాహుబలి భామలు.. పాతరపెట్టాల్సిందే రికార్డులు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. హిస్టారికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఎలాంటి కాంప్రమైజ్‌లు లేకుండా చిత్ర యూనిట్ చూస్తున్నారు. ఇప్పటికే భారీ క్యాస్టింగ్‌ ఉన్న ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నారు చిత్ర యూనిట్.

గతంలో మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన అనుష్క, బాహుబలి వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత చిరంజీవితో కలిసి సైరాలో ఓ స్పెషల్ సీన్ చేయయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె చేసేది గెస్ట్ రోల్ కాదని.. ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపిస్తుందని తెలుస్తోంది. ఇంకో విశేషమేమిటంటే.. ఇదే పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా డ్యాన్స్ చేయనుంది. ఒకే పాటలో చిరుతో కలిసి ఇద్దరు హీరోయిన్లు కనిపించనుండటంతో ఆ పాట ఎలా ఉంటుందా అని ఆతృతగా చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

ఇకపోతే ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్ల అట్రాక్షన్ ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఏదేమైనా ఓ పెద్ద సినిమాలో మరోపెద్ద సినిమా హీరోయిన్లు స్పెషల్ సాంగ్ చేయడం నిజంగానే స్పెషల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news