Gossipsఅందాల అనుపమ క్రికెట్ ఆడితే.. ప్రతి బాలు బౌండరీనే..!

అందాల అనుపమ క్రికెట్ ఆడితే.. ప్రతి బాలు బౌండరీనే..!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన నాలుగైదు సినిమాలే కాని ఆమెకు వచ్చిన క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కచ్చితంగా అనుపమ పరమేశ్వరన్ ఒకరని చెప్పొచ్చు. ప్రస్తుతానికి యువ హీరోలతోనే చేస్తున్నా ఏదో ఒకరోజు స్టార్ హీరోల అవకాశాలను పట్టేస్తుంది అనుపమ.

ప్రస్తుతం మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న తేజ్ ఐలవ్యూ సినిమాలో నటిస్తుంది అనుపమ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేడియో జాకీలతో ఆడిన క్రికెట్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తేజ్ టీం తరపున ఆడిన అనుపమ బ్యాట్ పట్టి బౌండరీలు కొడుతుంటే భలే అనిపిస్తుంది.

సినిమా ప్రమోషన్స్ తో ప్రేక్షకులను ఎట్రాక్ చేస్తున్న తేజ్ ఐలవ్యూ మూవీ ఈసారి ఆడియెన్స్ ను థ్రిల్ చేయడం ఖాయమని అంటున్నారు. వరుస ఫ్లాపులతో కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్న సాయి ధరం తేజ్ కు ఈ సినిమాతో హిట్ కొట్టేలానే ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news