అనుని .. పవన్, బన్ని ఇద్దరు షాక్ ఇచ్చారు..!

anu-immanuel

టాలీవుడ్ లో హీరోలు ఎంతమంది వస్తున్న హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువగా వస్తుంటారు. అందరికి ఇక్కడ అదృష్టం కలిసిరాదు కూడా. కొన్నాళ్లు ముంబై భామలకు ఎట్రాక్ట్ అయ్యి అక్కడ నుండి హీరోయిన్స్ తెచ్చుకున్న మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రస్తుతం మలయాళ భామల మీద ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం తెలుగులో లీడింగ్ లో ఉన్న వారంతా ఒకరిద్దరు తప్ప అంతా అక్కడివారే.

వారిలో అను ఇమ్మాన్యుయెల్ ఒకరు. నాని మజ్ఞు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ వెంటనే స్టార్ సినిమాలను దక్కించుకుంది. పవన్ తో అజ్ఞాతవాసి, బన్నితో నా పేరు సూర్య సినిమాల్లో నటించింది. అయితే అన్ లక్కీలీ ఆ రెండు ఫెయిల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రవితేజ సినిమాకు ముందు అను ఇమ్మాన్యుయెల్ ను తీసుకోగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకుదని తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ హీరోగా చేస్తుండగా శ్రీను వైట్ల డైరక్షన్ చేస్తున్నాడు. శ్రీమంతుడు నుండి వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఈ నిర్మాణ సంస్థ ఎలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ను రిపీట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే అనుని కాదని ఆ ప్లేస్ లో ఇలియానాకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. ప్రస్తుతం తన సినిమాల ఫలితాల వల్ల డిప్రెషన్ కు గురైన అను ఇమ్మాన్యుయెల్ తాను కూడా సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేయాలని చూస్తుంది.

Leave a comment