కేరళ బ్యూటీ బుట్టలో మరో మెగా హీరో

anu emmunuel

అను ఇమ్మానుయేల్ ఈ పేరు ఈమధ్యకాలంలో తెలుగు తెరమీద కొంచెం కొంచెం పాపులర్ అవుతోంది. సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ కుట్టి అంతే సైలెంట్ గా పెద్ద హీరోల పక్కన అవకాశాలు కొట్టేస్తోంది. మజ్నూ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు నిజంగా లక్కీ గర్ల్ అనే చెప్పాలి.
ఒక సాధారణ హీరోయిన్ గా ప్రారంభమైన కెరీర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినిమా రావడంతో, కెరీర్ మరో మలుపు తిరిగింది. ఈ సినిమా దెబ్బకి టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరబోతోంది. పవర్ స్టార్ నటిస్తోన్న “అజ్ఞాతవాసి” సినిమా విడుదల కాకముందే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన “నా పేరు సూర్య” సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ మలయాళీ బ్యూటీ.

అలాగే … మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా నటిస్తోందని ఫిలిం నగర్ లో ఒకటే గుసగుసలు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న బోయపాటి శ్రీను – రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ సెలెక్ట్ అయ్యిందనే సమాచారం అందుతోంది. రాశి ఖన్నా, అనులను పరిగణలోకి తీసుకుని చివరిగా అను వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది.

అతి తక్కువ సమయంలో ముగ్గురు టాప్ మెగా హీరోలతో నటించే అరుదైన అవకాశం మాత్రం అను దక్కించుకుంది అంటే నిజంగా ఈ అమ్మడు లక్కీ గర్లే అని చెప్పాలి. వీటితో పాటు ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోల పక్కన కూడా ఛాన్స్ కొట్టేసింది అను. మొత్తానికి రాబోయే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అను మెరవబోతోందన్నమాట.

Leave a comment