గుంటూర్ టాకీస్ కాదు ‘అంతకుమించి’ రెచ్చిపోయిన రష్మి..!

anthakuminchi trailer

జబర్దస్త్ షోతో సూపర్ పాపులారిటీ సంపాదించిన రష్మి గౌతం ఆ క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై గుంటూర్ టాకీస్ అంటూ యువత మనసులు దోచేసింది. హాట్ అప్పీల్ తో అమ్మడు చేసిన అందాల ప్రదర్శన ఆమెకు మంచి మైలేజ్ తెచ్చి పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో రష్మి సూపర్ క్రేజ్ తెచ్చుకోగా వరుసగా అలాంటి సినిమాలే రావడం కొద్దిపాటి గ్యాప్ ఇచ్చింది.

ఇప్పుడు గుంటూర్ టాకీస్ కాదు అంతకుమించిన రేంజ్ లో ‘అంతకుమించి’ సినిమాలో రెచ్చిపోయింది రష్మి. జాని దర్శకత్వంలో జై, రష్మి కలిసి నటిస్తున్న సినిమా అంతకుమించి. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా ట్రైలర్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా బాగుందని.. సినిమాపై క్యూరియాసిటీ పెంచిందని అన్నారు సుకుమార్. సతీష్ గాజుల, ఏ.పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ కానుందట.

Leave a comment