Gossips‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు..

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు..

సాహో ఫీవ‌ర్‌కు భార‌త‌దేశ‌మే కాదు ప్ర‌పంచం అంతా సాహో అనేలా ఉంది. సాహో రిలీజ్‌కు ముందే ప్ర‌పంచ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓ సినిమాపై అభిమానులు అంచ‌నాలు పెట్టుకుంటే దానిని ఏ రేంజ్లో ఆద‌రిస్తారో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాకు సంబంధించి స్టిల్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఏది వ‌చ్చినా హైలెట్ చేసేస్తుంటారు. ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌చ్చాక వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. రూ. 350 కోట్ల‌ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సాహోపై లెక్క‌కు మించి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా సాహో సినిమాలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో ప్రభాస్‌ బ్యాడ్‌ బ్యాయ్‌ అంటూ ఓ ప్రత్యేక గీతానికి స్టెప్పులేసిన వీడియోను రిలీజ్ చేశారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే ఈ పాటను 85,24,114 మంది వీక్షించారు. అంతేకాకుండా 3,58,664 మంది లైక్‌ కొట్టారు. దీంతో సాహో సాంగ్ ఖాతాలో ప్ర‌పంచ రికార్డు ప‌డింది. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో కేవలం 24 గంటల్లో ఇన్ని లక్షల మంది వీక్షించిన తొలి పాటగా ‘సాహో.. బ్యాడ్‌ బాయ్‌’నిలిచింది.

యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ నిర్మించిన ఈ సినిమాకు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఆగస్టు 30న విడుదల కానున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news