Gossipsరాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న అంజలి... !

రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న అంజలి… !

సినిమా హీరోలు, హీరోయిన్లు అంతా ఇప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది హీరోలు..హీరోయిన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు కూడా. తమిళనాడులో ‘కమల్ హాసన్’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘రజనీకాంత్’ కూడా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ‘అంజలి’ కూడా రాజకీయాల్లోకి వస్తారంట. రియల్ లైఫ్ లో కాదు..రీల్ లైఫ్ మాత్రమేనండోయ్.. !

గీతాంజ‌లి, షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి అనేక  విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగమ్మాయి  ‘అంజలి’ తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకొంటోంది. అయితే ఆమె తాజాగా నటిస్తున్న చిత్రంలో రెండు పాత్రలను పోషిస్తోంది. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా ‘అల్లుడు సింగం’. సినిమా రూపొందుతోంది.

మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ‘అల్లుడు సింగం’ లో అంజలి ముఖ్య పాత్ర పోషిస్తోందని, లాయర్‌, రాజకీయ నేతగా రెండు రకాల పాత్రల్లో కనిపించబోతుందట‌. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా. అయితే నిజ జీవితంలో కూడా అంజలి రాజకీయాల్లోకి వచ్చి తన  తడాఖా చూపించాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news