డైరెక్టర్ మొహం పగలగొట్టిన హీరోయిన్..

24

తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కోలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యింది అంజలి. తమిళంలో వచ్చిన జర్నీ సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ బ్యూటీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో తెలుగులోనూ అదిరిపోయే సక్సెస్ కొట్టింది. కానీ ఆ తరువాత సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయింది ఈ భామ. దీంతో వరుసబెట్టి సినిమాలు చేసినా అవి సక్సెస్‌లుగా మార్చలేకపోయింది. అయితే తాజాగా ఈ బ్యూటీ ఒక డైరెక్టర్ మొహం పగలగొట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

అసలు విషయం ఏమిటంటే.. ‘లీసా’ అనే సినిమాలో నటిస్తున్న అంజలి షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ సీన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న దోస పెనంను కెమెరా వైపు విసిరేయాల్సి ఉంది. అంజలి ఇదే ఉద్దేశ్యంతో ఆ దోస పెనాన్ని బలంగా విసిరింది. అయితే అది కాస్త కెమెరా వెనుక ఉన్న డైరెక్టర్‌ రాజు విశ్వనాథ్ మొహంపై పడింది. దీంతో అతడి కనుబొమ్మల మధ్య చాలా బలమైన దెబ్బ తగిలింది. ఇది చూసి చిత్ర యూనిట్ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే దర్శకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అతడి దెబ్బ తగిలిన చోట డాక్టర్లు కుట్లు వేశారు.

ఇలా జరగడంతో అంజలి చాలా ఫీల్ అయ్యిందట. ఆమె దర్శకుడికి క్షమాపణలు కూడా చెప్పిందట. కానీ ఆమె కావాలని చేయలేదు కదా అంటూ దర్శకుడు ఈ ఘటనను తేలికగా తీసుకున్నాడు.

Leave a comment