Gossipsసీరియల్ నటితో ప్రేమలో పడ్డ యాంకర్ రవి

సీరియల్ నటితో ప్రేమలో పడ్డ యాంకర్ రవి

ఇప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న రవి తొలిసారిగా సినీ ఇండ్రస్ట్రీలో హీరోగా అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటివరకు బుల్లి తెర మీద సందడి చేసిన ఈ అల్లరి పిల్లోడు ఇక వెండితెర మీద తన నటన విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధం అయిపోయాడు.

‘ఇది మా ప్రేమ కథ’ అంటూ త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తోంది. మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయోధ్య కార్తీక్ అనే కొత్త దర్శకుడి ఆధ్వర్యంలో ఈ సినిమా డిసెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది.

కేవలం ఒకే సినిమాకి ప‌రిమితం కాకూడ‌దు అనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించాను. అందుకే చాలామంది దగ్గర టెక్నీక్స్ నేర్చుకున్నాను అంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. సీరియల్ న‌టి మేఘన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news