Newsఎంగేజ్‌మెంట్‌తో ఫ్యాన్స్‌కి ఊహించని షాకిచ్చిన యాంకర్ లాస్య (ఫోటోలు)

ఎంగేజ్‌మెంట్‌తో ఫ్యాన్స్‌కి ఊహించని షాకిచ్చిన యాంకర్ లాస్య (ఫోటోలు)

Anchor Lasya got engaged with her soulmate on 30th January. This is really shocking news to every one.

ఏంటీ.. మళ్ళీ రూమర్లు రాయడం మొదలుపెట్టేశారా.. ఇంకెన్నాళ్లు ఇలాంటి చెత్త వార్తలు రాస్తారు? అని అనుకుంటున్నారా! అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఈసారి నిజంగానే యాంకర్ లాస్య ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అవును.. నిజం. స్వయంగా ఆ అమ్మడే తన అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో ఈ విషయాన్ని ఫోటోలతో సహా అధికారికంగా వెల్లడించింది. తొలుత తనకు ఎంగేజ్‌మెంట్ అవుతున్నట్లుగా ‘ఉంగరాల’ ఫోటోస్ పోస్ట్ చేసిన లాస్య.. ‘నిశ్చితార్థం’ అయ్యాక పెళ్ళికూతురు గెటప్‌లో ఉన్న ఫోటోని అప్‌లోడ్ చేసింది. దీంతో.. అందరూ షాకవ్వాల్సిన వంతు వచ్చింది.

సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాల్ని చాలా సీక్రెట్‌గా ఉంచినప్పటికీ.. వారం రోజుల క్రితమో లేక రెండు, మూడు రోజుల ముందే చెప్పడమో చేస్తారు. కానీ.. లాస్య మాత్రం అలా చేయలేదు. ఎంగేజ్‌మెంట్ ముందురోజు రాత్రి 9 గంటలకు ఈ విషయం తెలిపి.. మరుసటిరోజు ఉదయాన్నే పెళ్ళికూతురుగా దర్శనమిచ్చింది. ఆ దెబ్బతో ఆమె అభిమానులు ఖంగుతినాల్సి వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ.. తాను పెళ్లి చేసుకోబోతున్న వరుడు పేరు మాత్రం వెల్లడించలేదు. ఆ విషయాన్ని అమ్మడు సీక్రెట్‌గా ఉంచింది. దాంతో.. లాస్యని చేసుకోబోతున్న ఆ వరుడు ఎవరు? అని రహస్యాన్ని తెలుసుకోవడం కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news