చరణ్ కోరిక తీరుస్తా అంటున్న అనసూయ !

anasuya vs charan

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రంగస్థలం 1985’లో అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తాను షూటింగ్ లో పాల్గొంది. త్వరలో జరగబోయే మరో షెడ్యూల్ లో ఆమె జాయిన్ కానుంది. అయితే తొలిసారి రంగస్థలం షూటింగ్ లో పాల్గొనప్పుడు రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కి ఓ మాట ఇచ్చిందట అనసూయ.

అదేంటంటే .. కాకరకాయ వంటని అనసూయ భలే చేస్తుందట.ఆ విషయం రామ్ చరణ్ కి తెలిసి నేరుగా అనసూయని అడిగేసాడంట కాకరకాయ స్పెషల్ గురించి.తాను స్వయంగా వండి రామ్ చరణ్, సుకుమార్ ల కోసం తీసుకొస్తానని మాటిచ్చిందట. అప్పటి నుంచి అనసూయ వండిన కాకరకాయ వంటని తీనేయలనే కోరికతో చరణ్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో అనసూయ షూటింగ్ లో పాల్గొననున్న షెడ్యూలో చరణ్ కి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెబుతోంది అనసూయ. అంతేకాదు. చరణ్ గ్రాస్పింగ్ సూపర్ అని, ఏ విషయాన్నైనా చాలా త్వరలో నేర్చుకొంటాడని పొగిడేస్తోంది.

Leave a comment